సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు పోచారం స్పీడ్.. అధికారులతో సమీక్ష

by Batti.Sumithra |   (  Updated:2026-07-16 15:01:42  IST  )

హైదరాబాద్, పబ్లిక్ గార్డెన్స్ లోని తన కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పై ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి.

సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు పోచారం స్పీడ్.. అధికారులతో సమీక్ష
X

దిశ, బాన్సువాడ : హైదరాబాద్, పబ్లిక్ గార్డెన్స్ లోని తన కార్యాలయంలో సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పై ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని వేగవంతం చేయడం లక్ష్యంగా, గత నెల 23 మే 2026న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం చెల్లించి అవసరమైన అనుమతులు పొందేందుకు రూ. 55.30 కోట్లను మంజూరు చేస్తూ జీఓనం. 37 ద్వారా 08 జూన్ 2026న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సిద్దాపూర్ రిజర్వాయర్ పురోగతి పై ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగేందుకు సంబంధిత అటవీ శాఖ అధికారులు PCCF శ్రావణ్ (నోడల్ ఆఫీసర్), ఇరిగేషన్ అధికారులు ENC శ్రీనివాస్, కామారెడ్డి ఇంచార్జి C.E.దక్షిణామూర్తి, బాన్సువాడ E.E. రాజశేఖర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించి, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన నాణ్యత లోపం లేకుండా పూర్తి చేయాలని అధికారులను పోచారం సూచించారు.

Next Story