- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో కోవిడ్ కేసుల కలకలం.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
by Vemula.Srinu Prasad |
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ నమోదు అయ్యాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కడప జిల్లాతో పాటు మంగళగిరి ఎయిమ్స్ పరిధిలో కొత్త కేసులు వెలుగు చూశాయి...

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్(Coronavirus) కేసులు మళ్లీ నమోదు అయ్యాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కడప జిల్లా(Kadapa District)తో పాటు మంగళగిరి ఎయిమ్స్(Mangalagiri AIIMS ) పరిధిలో కొత్త కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) అప్రమత్తమయ్యారు. కరోనా కేసులపై ప్రభుత్వం దృష్టి పెట్టారు. మంగళగిరి ఎయిమ్స్‌లో కోవిడ్ కేసు నమోదు కావడంపై ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా సూచించారు. రాపిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో నెల్లూరు జీజీహెచ్‌లో కరోనా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. కరోనా రోగులకు వెంటనే వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టారు. కరోనాతో భయపడొద్దని, టీమ్స్, కిట్లు రెడీగా ఉన్నాయని, వైద్యం అందించేందుకు డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారని వైద్యులు తెలిపారు.
Next Story






