కేతన్ హత్య కేసు నిందితురాలు సియా కుటుంబ దుకాణానికి నోటీసులు

by Ramesh Naini |

సంచలనం సృష్టించిన పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు ప్రధాన నిందితురాలు సియా గోయల్ కుటుంబానికి చెందిన మసాలా, డ్రై ఫ్రూట్స్ దుకాణంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కొరడా ఝుళిపించింది.

కేతన్ హత్య కేసు నిందితురాలు సియా కుటుంబ దుకాణానికి నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టించిన పూణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు ప్రధాన నిందితురాలు సియా గోయల్ కుటుంబానికి చెందిన మసాలా, డ్రై ఫ్రూట్స్ దుకాణంపై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కొరడా ఝుళిపించింది. పూణె మార్కెట్ యార్డ్‌లోని ఈ దుకాణంలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించినట్లు బుధవారం జరిపిన తనిఖీల్లో అధికారులు గుర్తించారు. దీంతో తక్షణమే విక్రయాలు నిలిపివేయాలని నోటీసులు జారీ చేశారు. కల్తీ ఆరోపణల నేపథ్యంలో దుకాణం నుంచి నమూనాలు సేకరించిన అధికారులు.. రూ.8.14 లక్షల విలువైన 4,172 కిలోల సరకును స్వాధీనం చేసుకున్నారు. సరైన లైసెన్స్ కూడా లేకపోవడంతో దీనిపై తదుపరి దర్యాప్తు చేపట్టారు.

హత్య కేసులో విచారణ..

జూన్ 18న చారిత్రక లోహగఢ్ కోట వద్ద కేతన్‌ను లోయలోకి తోసేసి హత్య చేసిన కేసులో సియా, ఆమె ప్రియుడు చేతన్‌లను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. కేతన్‌తో వివాహం ఇష్టం లేకే వీరు ఈ దారుణానికి ఒడిగట్టారు. కాగా, కేతన్‌తో నిశ్చితార్థం తర్వాత సియా, చేతన్‌లు రాజస్థాన్‌లోని ఓ ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారన్న సమాచారంపైనా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Next Story