Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రాగల మూడు రోజులు వర్షాలు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-16 12:48:15  IST  )

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. రాగల మూడు రోజులు వర్షాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద‌తో పాటు పరిసర ప్రాంతాలలో సాయంత్రం, రాత్రి వేళల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పగటిపూట ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని అంచనా వేశారు.

ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలపై ప్రభావం..

తీవ్ర అల్పపీడన ప్రభావం ప్రధానంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ (North and Northeast Telangana) పరిధిలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, హన్మకొండ, వరంగల్, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో వర్షాలు అధికంగా ఎక్కువగా ఉండే అవకాశం వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Next Story