- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 22న 'తల్లికి వందనం' నిధుల విడుదల
ఏపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని తల్లులకు భారీ తీపి కబురు అందించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని తల్లులకు భారీ తీపి కబురు అందించింది. కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు సర్కార్ సర్వం సిద్ధం చేసింది. ఈ పథకం కింద మొత్తం 67,47,190 మంది అర్హులైన విద్యార్థులకు చెందిన రూ.42,70,802 మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా డీబీటీ (Direct Benefit Transfer) పద్ధతిలో ప్రభుత్వం నగదును జమ చేయనుంది. ఈ విడత నిధుల విడుదల కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 10,120 కోట్లను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద ఒక్కో విద్యార్థికి రూ. 13 వేల చొప్పున తల్లుల అకౌంట్లలో జమ కానున్నాయి. ఈ పథకం కింద డబ్బులు ఎలాంటి అడ్డంకులు లేకుండా జమ కావాలంటే, తల్లులు తమ ఆధార్ కార్డ్‌ను సంబంధిత బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా లింక్ (Aadhaar Seeding) చేయించుకోవాలి. మీ బ్యాంక్ ఖాతా సక్రియంగా (Active) ఉందో లేదో ముందే సరిచూసుకోవాలని అధికారులు చెబుతున్నారు.






