కామారెడ్డి జిల్లాలో ఐదుగురు ఎస్సైల బదిలీలు

by Batti.Sumithra |

కామారెడ్డి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఐదుగురు ఎస్సైలను బదిలీలు చేస్తూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

కామారెడ్డి జిల్లాలో ఐదుగురు ఎస్సైల బదిలీలు
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న ఐదుగురు ఎస్సైలను బదిలీలు చేస్తూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. భిక్కనూర్ ఎస్సై ఆంజనేయులను రాజంపేటకు, రాజంపేట ఎస్సై మహేశ్ ను కామారెడ్డి సీసీఎస్ కు అటాచ్ చేశారు. అలాగే మాచారెడ్డి ఎస్సై అనిల్ ను భిక్కనూర్ కు, బీబీపేట ఎస్సై విజయ్ ను మాచారెడ్డికి, బాన్సువాడ టౌన్ ఎస్సై నవీన్ చంద్రను బీబీపేట ఎస్సైగా బదిలీ చేశారు.

Next Story