రాష్ట్రంలో మూడు పోర్టుల అభివృద్ధికి భూసేకరణ.. ఉత్తర్వులు జారీ

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు మూడు పోర్టులకు భూమిని సేకరించేందుకు సిద్ధమైంది..

రాష్ట్రంలో మూడు పోర్టుల అభివృద్ధికి భూసేకరణ.. ఉత్తర్వులు జారీ
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం(NDA Government) దృష్టి సారించింది. ఈ మేరకు మూడు పోర్టు(Ports)లకు భూమిని సేకరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు మళ్లీ భూసేకరణ(Land Acquisition) చేపట్టాలని నిర్ణయించింది. రెండో దశలో 6,248.54 ఎకరాల భూమి సేకరణకు కసరత్తులు ప్రారంభించింది. రూ.1,638.52 కోట్లతో భూసేకరణ చేపట్టేందుకు పరిపాలనా అనుమతులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టుకు 1,903.39 ఎకరాలు, మచిలీపట్నం పోర్టుకు 1,420.70 ఎకరాలు, రామాయపట్నం పోర్టుకు 2,924.45 ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధమైంది.

Next Story