మేడ్చల్ ఎక్సైజ్ జిల్లా ఇక కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ జిల్లా

by Ratna Kumari |

రాష్ట్ర ప్రభుత్వం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను పరిపాలనా సౌలభ్యం కోసం పునర్వ్యవస్థీకరించింది.

మేడ్చల్ ఎక్సైజ్ జిల్లా ఇక కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ జిల్లా
X

దిశ, పేట్ బషీరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను పరిపాలనా సౌలభ్యం కోసం పునర్వ్యవస్థీకరించింది. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో జీహెచ్‌ఎంసీ విస్తరణకు అనుగుణంగా సైబరాబాద్, మల్కాజిగిరి ఎక్సైజ్ డివిజన్లను ఏర్పాటు చేయడంతో పాటు, వాటి పరిధిలోని ఎక్సైజ్ జిల్లాలు, స్టేషన్లు, మున్సిపల్ వార్డుల పరిధులను కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇప్పటి వరకు ఉన్న మేడ్చల్ ఎక్సైజ్ జిల్లా పేరును కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ జిల్లాగా మార్చారు. అలాగే నిజాంపేట్, మాదాపూర్, ఆలీయాబాద్ పేర్లతో మూడు కొత్త ఎక్సైజ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

సైబరాబాద్ ఎక్సైజ్ డివిజన్‌లో రెండు జిల్లాలు..

కొత్తగా ఏర్పాటు చేసిన సైబరాబాద్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలో శేర్లింగంపల్లి ఎక్సైజ్ జిల్లా, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ జిల్లాలను ఏర్పాటు చేశారు. ఇందులో పూర్వపు మేడ్చల్ ఎక్సైజ్ జిల్లాను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ జిల్లాగా మార్చి పరిధులను పునర్విభజించారు.

కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ జిల్లా పరిధిలోని స్టేషన్లు..

కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ జిల్లాను మొత్తం ఎనిమిది స్టేషన్లుగా విభజించారు. మేడ్చల్ స్టేషన్ : మేడ్చల్, పుదూర్-కిష్టాపూర్, గుండ్లపోచంపల్లి, కుత్బుల్లాపూర్ స్టేషన్ : రోడమెస్త్రినగర్, జగద్గిరిగుట్ట, రంగారెడ్డినగర్, చింతల్, గిరినగర్, గణేశ్‌నగర్, పద్మనగర్, కుత్బుల్లాపూర్, పేట్‌బషీరాబాద్, కొంపల్లి స్టేషన్ : కొంపల్లి, దూలపల్లి, సుభాష్‌నగర్, సాయిబాబానగర్, మహదేవపురం, గాజులరామారం, షాపూర్‌నగర్, సూరారం, నిజాంపేట్ స్టేషన్ (కొత్తది) : నిజాంపేట్, బాచుపల్లి, భండారి లేఅవుట్, ప్రగతినగర్, మాదాపూర్ స్టేషన్ (కొత్తది) : బహదూర్‌పల్లి, బౌరంపేట్, దుండిగల్, అంజయ్యనగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, ఇజ్జత్‌నగర్, మాతృశ్రీనగర్, మయూరినగర్, కూకట్‌పల్లి స్టేషన్ హైదర్‌నగర్, భాగ్యనగర్, శంషిగూడ, అల్విన్ కాలనీ, వివేకానందనగర్, వెంకటేశ్వరనగర్, కూకట్‌పల్లి, వసంతనగర్, బాలానగర్ స్టేషన్ : బాలాజీనగర్, కేపీహెచ్‌బీ కాలనీ, కైత్లాపూర్, గాయత్రినగర్, అల్లాపూర్, మోతీనగర్, మూసాపేట్, ప్రశాంత్‌నగర్, బాలానగర్, ఆలీయాబాద్ స్టేషన్ (కొత్తది): ఆలీయాబాద్, ఎల్లంపేట్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు.

నిఘా మరింత పటిష్టం..

ఈ పునర్వ్యవస్థీకరణతో క్షేత్రస్థాయిలో ఎక్సైజ్ శాఖ నిఘా మరింత సమర్థవంతంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు. మున్సిపల్ వార్డుల వారీగా పరిధులు ఖరారు కావడంతో అక్రమ మద్యం రవాణా, విక్రయాలపై మరింత సమర్థవంతంగా నిఘా పెట్టే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న సిబ్బందినే వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story