సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్లింక్ ఇట్ చాక్లెట్స్ ఆర్డర్

by Muthe.Rajitha |

ఇన్స్టంట్ గ్రోసరీ డెలివరీ యాప్ 'బ్లింక్ ఇట్' (Blinkit) వేదికగా ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఒక సరికొత్త చాక్లెట్ ఛాలెంజ్ తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బ్లింక్ ఇట్ చాక్లెట్స్ ఆర్డర్
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం ట్రెండ్ అవుతుందో ఊహించడం కష్టం. తాజాగా ఇన్స్టంట్ గ్రోసరీ డెలివరీ యాప్ 'బ్లింక్ ఇట్' (Blinkit) వేదికగా ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఒక సరికొత్త చాక్లెట్ ఛాలెంజ్ తెగ వైరల్ అవుతోంది. తమ బెస్ట్ ఫ్రెండ్స్‌కు చాక్లెట్లు ఆర్డర్ చేయాలంటూ ఒక ఫన్నీ రీల్‌ను షేర్ చేయడం, ఆ తర్వాత వారిలో ఎంతమంది నిజంగా చాక్లెట్లు పంపించారో చూపిస్తూ మళ్లీ మరో రీల్ పోస్ట్ చేయడం ఈ ట్రెండ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ క్రేజీ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు నెటిజన్లు దొరికిందే ఛాన్స్ అంటూ తమ ఫ్రెండ్స్ గ్రూపులన్నిటికీ ఈ రీల్స్ షేర్ చేస్తూ ఉచితంగా చాక్లెట్లు ఆర్డర్ చేయించుకుంటున్నారు. దీంతో ఇన్స్టాగ్రామ్ అంతా ఈ చాక్లెట్ ముచ్చట్లతో నిండిపోయింది.

అయితే ఇది యూజర్లు యాదృచ్ఛికంగా మొదలుపెట్టిన ట్రెండా లేక బ్లింక్ ఇట్ సంస్థే తన అమ్మకాలను పెంచుకోవడానికి ప్లాన్ చేసిన 'వైరల్ మార్కెటింగ్ స్ట్రాటెజీ'నా అనేది తెలియదు కానీ, ప్రస్తుతం ఈ చాక్లెట్ల వ్యవహారం మాత్రం నెట్టింట టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ఈ ట్రెండ్ పుణ్యమా అని ఫ్రెండ్స్ మధ్య ఫన్నీ మీమ్స్, చాట్స్ వైరల్ అవ్వడమే కాకుండా, బ్లింక్ ఇట్ యాప్‌లో చాక్లెట్ల విక్రయాలు కూడా ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

Next Story