- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నారపల్లి ఎస్ఆర్వోలో ప్రైవేటు వ్యక్తి హల్చల్
నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ ప్రైవేట్ వ్యక్తి అనధికారికంగా విధుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.

దిశ, ఘట్కేసర్ : నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ ప్రైవేట్ వ్యక్తి అనధికారికంగా విధుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు 10 ఏళ్లుగా ఆ వ్యక్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అంతా తానై చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది. ఏ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరగాలన్నా సదరు వ్యక్తి ఓకే అని చెబితేనే సబ్ రిజిస్ట్రార్ లు రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారని ప్రచారం జరుగుతోంది. జూలై 9న ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ సునీల్ కుమార్ తో నారపల్లిలోని హైదరాబాద్ - వరంగల్ రహదారి పక్కన ఉన్న కమర్షియల్ భవనాన్ని రెసిడెన్షియల్ గా చూపించి రిజిస్ట్రేషన్ (డాక్యుమెంట్ నెంబర్: 7748/2026) చేయించిన విషయం వెలుగులోకి రావడంతో సదరు వ్యక్తి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రాకుండా పరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్ల తర్వాత ప్రైవేటు వ్యక్తి ఆగడాలకు చెక్ పడిందని రియల్టర్లు, డాక్యుమెంట్ రైటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నారపల్లికి రావాలంటే హడలిపోతున్నారు...
నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దాదాపు 10 ఏళ్లుగా ప్రైవేటు వ్యక్తిని నమ్మిన సబ్ రిజిస్ట్రార్ లు రిజిస్ట్రేషన్లు చేసేవారిని, ఈ ప్రైవేటు వ్యక్తిని నమ్మిన ఎస్ఆర్ఓ శ్రీదేవి కిందటి నెలలో సస్పెండైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె సస్పెన్షన్ తర్వాత కూడా తన కార్యకలాపాలను కొనసాగించిన ప్రైవేట్ వ్యక్తి నారపల్లి సీనియర్ అసిస్టెంట్ సునిల్ కుమార్ తో పాటు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం (డీఆర్ఓ) నుంచి ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ లుగా వచ్చిన వారితో తప్పుడు రిజిస్ట్రేషన్ లు చేయించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవినీతి ఆరోపణతో సంచలనం సృష్టించిన నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శాశ్వత సబ్ రిజిస్ట్రార్ గా రావడానికి ఎవ్వరు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్లు ఉదయం 11:30 గంటల వరకు రాకపోవడంతో సబ్ రిజిస్ట్రార్ క్యాబిన్ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ లు సమయపాలన పాటించకపోవడంతో రిజిస్ట్రేషన్ ల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు తెలిపారు.
ప్రైవేటు వ్యక్తుల ఆగడాలు అరికట్టాలి...
నారగోని ప్రవీణ్ కుమార్, తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు
నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. అక్రమ రిజిస్ట్రేషన్ లపై విచారణ జరిపించాలి. ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ లతో కాకుండా శాశ్వత సబ్ రిజిస్ట్రార్ ను నియమించాలి.






