- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అతిథి దేవో భవ’: చీర జారినా.. గౌరవం జారనివ్వలేదు! విదేశీ వనితకు చీరకట్టిన మహిళా కానిస్టేబుల్ వైరల్
తాజ్ మహల్ సందర్శనకు వచ్చిన ఓ విదేశీ పర్యాటకురాలికి ఉత్తరప్రదేశ్ మహిళా పోలీస్ చేసిన చిన్న సాయం ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తాజ్ మహల్ సందర్శనకు వచ్చిన ఓ విదేశీ పర్యాటకురాలికి ఉత్తరప్రదేశ్ మహిళా పోలీస్ చేసిన చిన్న సాయం ఇప్పుడు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. భారతీయ సంస్కృతికి, ‘అతిథి దేవో భవ’ స్ఫూర్తికి ఈ ఘటన అద్దం పడుతోంది.
అసలేం జరిగిందంటే..?
అర్జెంటీనాకు చెందిన పర్యాటకుల బృందం తాజ్ మహల్ చూసేందుకు వచ్చింది. ఆ బృందంలోని ఒక మహిళా పర్యాటకురాలు ముచ్చటపడి భారతీయ సంప్రదాయ దుస్తులైన చీరను ధరించింది. అయితే, చీర కట్టుకోవడంలో సరైన అనుభవం లేకపోవడంతో పశ్చిమ గేటు వద్ద అది అకస్మాత్తుగా జారిపోయి ఆమె తీవ్ర అసౌకర్యానికి గురైంది. పరిస్థితిని గమనించిన థానా తాజ్ సెక్యూరిటీ క్విక్ రెస్పాన్స్ టీమ్ (QRT) మహిళా కానిస్టేబుల్ గుడ్డి దేవి వెంటనే స్పందించారు. పర్యాటకురాలి వద్దకు వెళ్లి ఎంతో ఆప్యాయంగా, మర్యాదపూర్వకంగా ఆమెకు చీరను కుచ్చిళ్లు పోసి, సౌకర్యంగా ఉండేలా కట్టారు.
థ్యాంక్ యూ యూపీ పోలీస్..
మహిళా కానిస్టేబుల్ చేసిన ఈ సాయానికి విదేశీ వనిత ఎంతో సంతోషించింది. ఊపిరి పీల్చుకున్న ఆమె.. ‘థ్యాంక్ యూ యూపీ పోలీస్’ అంటూ గుడ్డి దేవితో కలిసి ఫోటోలు దిగింది. భారతదేశపు అందమైన వస్త్రధారణలో ఒకటైన చీర అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె పేర్కొంది. ప్రస్తుతం ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పర్యాటకుల భద్రతే కాదు, సేవలోనూ తాము ముందుంటామని చాటిచెప్పిన కానిస్టేబుల్ గుడ్డి దేవిని ఆగ్రా పోలీస్ కమిషనరేట్‌తో పాటు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చిన్నదే అయినా ఈ ఆత్మీయ చర్య.. విదేశీయుల దృష్టిలో భారతీయుల గొప్పదనాన్ని మరోసారి చాటిచెప్పింది.






