కబ్జాదారుల చెర వీడిన పార్క్ స్థలం

by Taduka Kalyani |

హయత్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్ కాలనీ వాసులు చేస్తున్న సుదీర్ఘ పోరాటం ఫలించింది.

కబ్జాదారుల చెర వీడిన పార్క్ స్థలం
X

దిశ, చైతన్యపురి : హయత్ నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్ కాలనీ వాసులు చేస్తున్న సుదీర్ఘ పోరాటం ఫలించింది. కాలనీ పార్క్ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తుల అటకట్టించి 1200 గజాల స్థలం హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకుని కాలనీవాసులకు అప్పజెప్పారు. మధుయాష్కి గౌడ్ సిఫారసు మేరకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో డిప్యూటీ కమిషనర్, హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది తెలంగాణ యాదవ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్ వెంకటాద్రి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళలు స్థానిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story