- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోవుల అక్రమ రవాణా.. అధికారుల సహకారంపై అనుమానాలు..!
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న కొందరు ప్రయత్నిస్తూ గోవును ఒక దేవత మూర్తిగా భావించి పూజిస్తుంటే, కొందరు అక్రమ వ్యాపారులు అలాంటి గోవులను వాటి సంతతి అయిన ఎద్దులతో వ్యాపారం సాగిస్తున్నారు....

దిశ, సూళ్లూరుపేట: గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న కొందరు ప్రయత్నిస్తూ గోవును ఒక దేవత మూర్తిగా భావించి పూజిస్తుంటే, కొందరు అక్రమ వ్యాపారులు అలాంటి గోవులను వాటి సంతతి అయిన ఎద్దులతో వ్యాపారం సాగిస్తున్నారు. సూళ్లూరుపేటకు చెందిన ఓ అజ్ఞాతవాసి కుప్పారెడ్డి పాలెం కేంద్రంగా గోవుల సంపదను అక్రమంగా పలు రాష్ట్రాలకు తరలించి కాసులు పోగేసుకుంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుండి భారీ కంటైనర్ వాహనాల్లో ఈ కేంద్రానికి దిగుమతి చేసుకొని ఇక్కడ నుండి పలు రాష్ట్రాలకు భారీ వాహనాల్లో తరలిస్తున్నారు. గోవులు, ఎద్దుల మాంసానికి కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉండడంతో వారి నుంచి వచ్చిన ఆర్డర్ ను బట్టి పశువులను పంపిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం మాత్రం గోవులతో పాటు, ఎద్దులను మాంసం విక్రయాలకు తరలించకూడదని, గేదె, జాతికి చెందిన వాటి మాంసాన్ని మాత్రమే తరలించే వెసులుబాటు కల్పించింది. కానీ మన ప్రాంతం నుండి భారీ వాహనాల్లో తరలిపోతున్న ఏ అధికారి కట్టడి చేసి గోవుల సంపదను పరిరక్షించ లేని పరిస్థితి ఉంది. నాడు ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో గోవులు, ఎద్దులు అన్నా! నేడు పల్లె ప్రాంతాల్లో సైతం పశు సంపద కనుమరుగవుతుంది. అనుమతులు లేని అనధికారిక అక్రమ రవాణా కేంద్రంగా కుప్పారెడ్డిపాలెంలో పశువుల తరలింపు నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో రవాణా సూత్రధారి కి స్థానికుల సహకారం, ఒక ప్రభుత్వ శాఖ సిబ్బంది అండదండలతో పశువుల రవాణా సజావుగా సాగుతున్నట్లు కొంత సమాచారం. మండల కేంద్రానికి కిలోమీటరు పరిధిలో, జాతీయ రహదారికే ప్రక్కనే అనధికారిక అక్రమ వ్యాపారం సజావుగా సాగుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ కేంద్రానికి దిగుమతి అవుతున్న పశువులకు అవసరమైనంత ఆహారం అందించక, చాలీచాలని నీటిని ఏర్పాటు చేయడంతో వాటి ఆహార అవసరాలు కూడా సమకూర్చలేకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులు చర్యలు చేపడుతారా! వారి ప్రలోభాలకు లోబడి వదిలేస్తారా కొందరు ప్రశ్నిస్తున్నారు.
కార్యదర్శి వివరణ: అక్రమ రవాణా కేంద్రం ఏకొల్లు గ్రామపంచాయతీ పరిధిలో ఉంది. ఈ సంఘటనపై కార్యదర్శిని వివరణ కోరగా నాకు తెలియదు, ఎవరూ చెప్పలేదు, పరిశీలించి చట్ట విరుద్ధంగా సాగుతున్నట్లయితే చర్యలు తీసుకుంటానని కార్యదర్శి వివరణ ఇచ్చారు.






