- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TGEAPCET సెకండ్ ఫేజ్ షెడ్యూల్ రిలీజ్.. అందుబాటులో 27,487 సీట్లు
తెలంగాణ EAPCET-2026 రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: టీజీఈఏపీసెట్–2026 రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం జూలై 17న ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభించనునున్నారు. జూలై 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. జూలై 18, 19 తేదీల్లో అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. జూలై 22న కంటే ముందే విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. మొదటి విడతలో సీట్లు పొందిన వారిలో 19,325 మంది కళాశాలల్లో రిపోర్ట్ చేయలేదని అధికారులు తెలిపారు.
ఇక తొలి విడత అనంతరం 8,162 సీట్లు ఖాళీగా ఉండగా, రెండో విడత కౌన్సెలింగ్‌కు మొత్తం 27,487 సీట్లు అందుబాటులో ఉన్నట్లుగా వెల్లడించారు. నోటిఫికేషన్, హెల్ప్‌లైన్ కేంద్రాల జాబితా తదితర సమాచారం టీజీఈఏపీసెట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై, వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో మెరుగైన కళాశాల, కోరుకున్న కోర్సులో సీటు పొందే అవకాశం పెరుగుతుందని తెలిపారు.






