- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ‘ఐసీఎంఆర్ డ్రోన్’ విప్లవం.. 15 రోజుల టీబీ టెస్ట్ ఇక 5 రోజుల్లో!
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లాలో ఐసీఎంఆర్ 'i-DRONE' ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత వైద్య రంగంలో సాంకేతికతను జోడించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చేపట్టిన వినూత్న ప్రయోగం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఐసీఎంఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘i-DRONE’ ప్రాజెక్ట్ ద్వారా క్షయ వ్యాధి (TB) నిర్ధారణ సమయం తగ్గడమే కాకుండా, రోగుల జేబుకు చిల్లు పడకుండా ఆదా అయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
15 రోజుల నుంచి 5 రోజులకు..
అయితే, సాధారణంగా గ్రామాలు, మూరు ప్రాంతాల రోగుల నుంచి టీబీ కఫం (Sputum) నమూనాలను సేకరించి, లాబొరేటరీలకు పంపి రిపోర్టు వచ్చేసరికి ఇది వరకు సగటున 15 రోజుల సమయం పట్టేది. అయితే, ఈ డ్రోన్ ఆధారిత రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సమయం 15 రోజుల నుంచి కేవలం 5 రోజులకు తగ్గిపోయింది. దీంతో వ్యాధిని ముందే గుర్తించి, త్వరితగతిన వైద్యం అందించడానికి వీలవుతోంది. గతంలో రోగులు టీబీ పరీక్షల కోసం సుదూర ప్రాంతాల్లోని కేంద్రాలకు ప్రయాణించడం వల్ల ప్రయాణ ఖర్చులు, ఆ రోజు కూలి నష్టపోవడం వంటి కారణాల వల్ల సగటున రూ.9,451 వరకు ఖర్చయ్యేది. కానీ డ్రోన్ రవాణా విధానం ద్వారా రోగులు తమ గ్రామానికి దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే (PHC) శ్యాంపిల్స్‌ను ఇస్తుండటంతో, వారి సగటు ఖర్చు కేవలం రూ.91కి పడిపోయింది. చాలా మందికి ఈ ఖర్చు జీరోగా మారిందని నివేదిక పేర్కొంది.
పక్కాగా హబ్-అండ్-స్పోక్ నెట్‌వర్క్..
ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద 840 మంది రోగుల పేర్లను నమోదు చేసి, 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (PHCs), 60 సబ్ సెంటర్లు, 4 టీబీ యూనిట్లను లింక్ చేస్తూ ఓ హబ్-అండ్-స్పోక్ నెట్‌వర్క్‌ను ఎలాంటి ఆటంకం లేకుండా సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిహించారు. భౌగోళిక అడ్డంకులను అధిగమించడానికి, రోగుల మరింత భారాన్ని తగ్గించేందుకు టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందో ఈ అధ్యయనం నిరూపించిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బాల్ అధికారికంగా వెల్లడించారు.






