- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేధింపుల వల్లే రైతు ఆత్మహత్య..
కాగజ్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి వేధింపులు తాళలేక రైతు పెంటు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యులు గురువారం సిర్పూర్ టి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు.

దిశ, ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి వేధింపులు తాళలేక రైతు పెంటు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యులు గురువారం సిర్పూర్ టి ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలోని హీరపూర్ గ్రామానికి చెందిన టేకం పెంటు బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే మృతుడు పెంటుకు సంబంధించిన భూమిని కాగజ్ నగర్ కు చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తి రెవెన్యూ, పోలీస్ అధికారుల అండ దండలతో అక్రమంగా కబ్జా చేసి.,నాలుగేళ్ల నుంచి వేధింపులకు గురి చేస్తున్నారని తుండు దెబ్బ జాతీయ అధ్యక్షుడు బుర్స పోచయ్య ఆరోపించారు. యువరైతు ఆత్మహత్యకు కారణమైన వేణు గోపాల్ పై హత్య నేరం కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సర్వే నెంబర్ 37 లో కబ్జాలో ఉన్న ఆదివాసీల భూములకు సంపూర్ణ హక్కులు కల్పించాలని కోరారు.






