సీబీఐటీ లో కలకలం.. అధ్యాపకుడి వేధింపుల ఆరోపణలు

by Taduka Kalyani |

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా పేరొందిన సీబీఐటీ (సీబీఐటీ ) ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగిపై కులవివక్ష, వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి.

సీబీఐటీ లో కలకలం.. అధ్యాపకుడి వేధింపుల ఆరోపణలు
X

దిశ , చంపాపేట్ జూలై 16: ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థగా పేరొందిన సీబీఐటీ (సీబీఐటీ ) ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగిపై కులవివక్ష, వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనకు సంబంధించి కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు మరో ఇద్దరిపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. కళాశాలలోని ఈసీఈ (ఈసీఈ ) విభాగంలో నాన్-టీచింగ్ సిబ్బందిగా పనిచేస్తున్న సంజీవ్ అనే ఉద్యోగి తనను కులం పేరుతో దూషిస్తూ, మానసికంగా వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును పరిశీలించిన నార్సింగి పోలీసులు క్రైమ్ నెం.1323/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్ 352తో పాటు ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సెక్షన్ 3(1)(ఎస్) ప్రకారం కళాశాల ప్రిన్సిపాల్ నరసింహులు, ఎం. శివరెడ్డి, యాజమాన్య ప్రతినిధి ఎన్. సుభాష్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయంపై తెలంగాణ స్టేట్ టెక్నికల్ కాలేజీ ఎంప్లాయీస్ అసోసియేషన్ (టీఎస్టీసీఈఏ ) రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్ స్పందిస్తూ, విద్యార్థులకు విలువలు బోధించే విద్యాసంస్థల్లోనే ఉద్యోగులు కులవివక్షకు గురికావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని అన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పూర్తి స్థాయి విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరారు. అదేవిధంగా, ప్రైవేట్ సాంకేతిక విద్యాసంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, ఉద్యోగులకు తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్–1982 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story