- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా.. అసలు యాక్టర్ అవ్వాలనుకోలేదు: విజయ్ సేతుపతి
చిన్నతనంలో ఎదురైన పేదరికం కారణంగానే తాను చాలా చిన్న వయసులోనే మెచ్యూరిటీ సాధించానని విజయ్ సేతుపతి చెప్పారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇటీవలే ‘గాంధీ టాక్స్’ చిత్రంతో అలరించారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ చేస్తున్నారు. ఇందులో టబు, సంయుక్త, దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో పాటు ఆయన మిస్కిన్ దర్శకత్వంలో శృతి హాసన్, నాజర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ‘ట్రైన్’ సినిమాలో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్రలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న విజయ్ సేతుపతి తన చిన్ననాటి జ్ఞాపకాలను, ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను పంచుకున్నారు. చిన్నతనంలో ఎదురైన పేదరికం కారణంగానే తాను చాలా చిన్న వయసులోనే మెచ్యూరిటీ సాధించానని విజయ్ సేతుపతి చెప్పారు. తన బాల్యం మొత్తం ఆర్థిక ఇబ్బందులతోనే సాగిందని, ఏదైనా వస్తువు కావాలనుకుంటే తమ ఆర్థిక పరిస్థితిని బట్టి లెక్కలు వేసుకోవాల్సి వచ్చేదని గుర్తుచేసుకున్నారు.
చివరికి అప్పుల వాళ్లు ఇంటికి వచ్చినప్పుడు కూడా, తన తండ్రితో కలిసి తానే కూర్చుని ఆ సమస్యలను పరిష్కరించేవాడినని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో తమ కుటుంబ పరిస్థితులే తమ ఆలోచనలను, కోరికలను శాసించేవని తెలిపారు. సినిమాల్లోకి రావడం అనేది తన జీవితంలో అస్సలు అనుకోలేదని విజయ్ సేతుపతి వెల్లడించారు. తనకు బిజినెస్‌మెన్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేదని, పని చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. అందుకోసమే స్కూల్ చదివే రోజుల్లోనే రోజువారీ కూలి పనులకు వెళ్లేవాడినని, ఆ తర్వాత ఒక టెలిఫోన్ బూత్‌లో కూడా పనిచేశానని వివరించారు. జీవితంలో ఎదగడం కోసం ఎన్నో రాత్రిళ్లు కష్టపడి పని చేస్తూ చాలా తలుపులు తట్టానని ఆయన పేర్కొన్నారు. తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఇక్కడిదాగా వచ్చానని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.






