అసంపూర్తిగా డ్రైనేజీ నిర్మాణాలు

by Batti.Sumithra |

ఖమ్మం నగర అభివృద్ధి పైకి కనిపిస్తున్నంత గొప్పగా క్షేత్రస్థాయిలో లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అసంపూర్తిగా డ్రైనేజీ నిర్మాణాలు
X

దిశ, ఖమ్మం కార్పొరేషన్ : ఖమ్మం నగర అభివృద్ధి పైకి కనిపిస్తున్నంత గొప్పగా క్షేత్రస్థాయిలో లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఖమ్మం రాష్ట్రంలో అభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో ఉందని ప్రజాప్రతినిధులు, అధికారులు గొప్పలు చెప్పుకుంటుండగా, మరోవైపు వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులను అసంపూర్తిగా వదిలివేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత శాఖలు స్పందించడం లేదని విమర్శిస్తున్నారు.

అసంపూర్తిగా డ్రైనేజీ నిర్మాణాలు..

ఖమ్మం నగరంలోని పలుప్రాంతాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే సగం వరకు పనులు చేసి, అనంతరం కాంట్రాక్టర్లు వాటిని పూర్తిచేయకుండా వదిలేయడంతో సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీల్లో మురుగునీరు నిల్వ ఉండటమే కాకుండా, అక్కడి నుంచి రహదారులపైకి పొంగిపొర్లుతోంది. నివాసాల ఎదుట డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టి, వాటిని పూర్తిచేయకపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా నిల్వ ఉన్న మురుగునీటి నుంచి దుర్వాసన వెదజల్లడంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాలను పూర్తిచేసి, మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Next Story