హైదరాబాద్‌లో మరో దారుణం.. స్కూల్ విద్యార్థినిపై అత్యాచారం

by Muthe.Rajitha |

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న ఒక మైనర్ బాలికను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

హైదరాబాద్‌లో మరో దారుణం.. స్కూల్ విద్యార్థినిపై అత్యాచారం
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న ఒక మైనర్ బాలికను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం.. సదరు మైనర్ బాలిక బుధవారం ఉదయం రోజులాగే పాఠశాలకు బయలుదేరింది. ఆ సమయంలో ఆమెను గమనించిన స్థానిక యువకుడు వెంబడించి, బలవంతంగా బైక్‌పై ఎక్కించుకున్నాడు. ఆపై బాలికను సనత్‌నగర్‌ పరిధిలోని ఒక పార్కుకు తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

బాధితురాలు జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలపడంతో, బాలిక తల్లి వెంటనే సనత్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడుపై పోక్సో (POCSO) చట్టంతో పాటు పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఈ ఘటనపై తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story