సివిల్స్ ఆశావహులకు శుభవార్త.. ఫ్రీ కోచింగ్‌కు దరఖాస్తుల స్వీకరణ

by Vemula.Srinu Prasad |

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని.. టీజీ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఉచిత కోచింగ్ అందించనుంది. ...

సివిల్స్ ఆశావహులకు శుభవార్త.. ఫ్రీ కోచింగ్‌కు దరఖాస్తుల స్వీకరణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని.. టీజీ బీసీ ఎంప్లాయబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఉచిత కోచింగ్ అందించనుంది. ఈ ఏడాదికి సంబంధించి మొత్తం 150 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందులో 100 సీట్లు ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా, 50 సీట్లను నేరుగా (గతంలో సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు అర్హతను బట్టి) కేటాయిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.5 వేల స్టైపెండ్‌తో పాటు, వన్-టైమ్ బుక్ ఫండ్ కింద రూ.5వేలు అందజేస్తారు. అంతేకాకుండా నిపుణులైన ఫ్యాకల్టీతో బోధన, లైబ్రరీ సౌకర్యం, క్రమం తప్పకుండా పనితీరు మూల్యాంకన పరీక్షలు నిర్వహించనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.

అర్హతలు..

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంత అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి. ప్రస్తుతం ఎలాంటి ఉద్యోగంలో ఉండకూడదు. ఇతర కోర్సులు చేస్తూ ఉండకూడదు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2027 పరీక్షా నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ జూలై 17న ప్రారంభమై, ఆగస్టు 7తో ముగుస్తుంది. ఆగస్టు 16న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు

Next Story