- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొయినాబాద్ లో ఒకే ఇంటిపై 79 ఓట్లు నమోదు..?!
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారం జాగీర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని ఇంటి నెంబర్ 5-1 (ఫామ్‌హౌస్)పై ఏకంగా 79 ఓట్లు నమోదు కావడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని సర్పంచ్ వెంకటేష్ గౌడ్ అన్నారు.

దిశ, మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారం జాగీర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని ఇంటి నెంబర్ 5-1 (ఫామ్‌హౌస్)పై ఏకంగా 79 ఓట్లు నమోదు కావడం తీవ్ర అనుమానాలకు తావిస్తోందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి అనర్హులైన ఓటర్లను వెంటనే తొలగించాలని సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు గురువారం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఫామ్‌హౌస్‌లో కొద్దిమంది సిబ్బంది మాత్రమే ఉండగా, ఓటర్ల జాబితాలో 79 మంది పేర్లు నమోదు కావడం ఆశ్చర్యకరమన్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో వీరిలో చాలామంది ఎనికేపల్లి శివారు ప్రాంతాల్లో నివసిస్తున్నారని, మరికొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించామని పేర్కొన్నారు. స్థానికేతరులను ఒకే చిరునామాపై చేర్చడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఈ వ్యవహారంపై బీఎల్వోలు, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి బాకారం జాగీర్ 5-1 ఇంటి నెంబర్‌కు సంబంధించిన ఓట్లను నిశితంగా పరిశీలించి, నకిలీ, డూప్లికేట్ నమోదులను తొలగించి పారదర్శక ఓటర్ల జాబితా రూపొందించాలని సర్పంచ్ వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.






