- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంబీబీఎస్ విద్యార్థులకు అలర్ట్.. కొత్త ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఫస్ట్ ఎంబీబీఎస్ (న్యూ రెగ్యులేషన్స్) రెగ్యులర్ పరీక్షల ఫీజు చెల్లింపు, అటెండెన్స్ నమోదు గడువులను సవరిస్తూ గురువారం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఫస్ట్ ఎంబీబీఎస్ (న్యూ రెగ్యులేషన్స్) రెగ్యులర్ పరీక్షల ఫీజు చెల్లింపు, అటెండెన్స్ నమోదు గడువులను సవరిస్తూ గురువారం కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, పరీక్షలు వాయిదా పడ్డాయంటూ సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, గతంలో ప్రకటించిన విధంగానే పరీక్షలు ఆగస్టు 2026లోనే యథాతథంగా జరుగుతాయని యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ స్పష్టం చేశారు. కేవలం పరీక్షకు ముందు పూర్తి చేయాల్సిన అంతర్గత ప్రక్రియల తేదీలను మాత్రమే మార్చినట్లు పేర్కొన్నారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం.. విద్యార్థుల అటెండెన్స్ శాతాన్ని లెక్కించడానికి జూలై 20ను కటాఫ్ తేదీగా నిర్ణయించారు. మెడికల్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల అటెండెన్స్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల వివరాలను జూలై 23 నుంచి 25వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి, 26న కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జూలై 27 నుంచి జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రూ. 200 జరిమానాతో ఆగస్టు 1, 2 తేదీల్లో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత వెబ్‌సైట్ లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలని, పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని వర్సిటీ స్పష్టం చేసింది.






