- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందువులందరూ ఐకమత్యంగా సంఘటితమై ఉండాలి : ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
హిందువుల పై దాడులు జరిగితే హిందువులందరూ ఐకమత్యంగా సంఘటితమై కలిసికట్టుగా ఉద్యమిస్తేనే భవిష్యత్తు ఉంటుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

దిశ, ఆర్మూర్ : హిందువుల పై దాడులు జరిగితే హిందువులందరూ ఐకమత్యంగా సంఘటితమై కలిసికట్టుగా ఉద్యమిస్తేనే భవిష్యత్తు ఉంటుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని పెర్కిట్ - కోటార్మూర్ చౌరస్తా వద్ద ఇస్కాన్ వారి జగన్నాథ రథయాత్రను గురువారం ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనే లహరి రఘుతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు. ఈమధ్య హిందువుల పై దాడులు జరిగితే వ్యాపారస్తులు దుకాణాలను మూసి ఆందోళనలో పాల్గొనలేదని చెప్పారు. పిప్రిలో హిందువు ఇంటిని దగ్ధం చేస్తే స్పందించలేదని పేర్కొన్నారు. చెంప దెబ్బ కొట్టినందుకు ఒక వర్గం వారు వందల సంఖ్యలో వచ్చారని, హిందువులు సైతం ఇంటికొకరు చొప్పున తరలి వచ్చి రాబోయే రోజుల్లో సత్తాచూపాలన్నారు. ఇండ్లు, దుకాణాల నుంచి బయటకు రానట్లయితే రాబోయే రోజుల్లో హిందువుల పరిస్థితి దారుణంగా ఉంటుందన్నారు.
బటెంగేతో కటేంగే కాబట్టి హిందూ సంస్థలు ఆందోళనకు పిలుపునిస్తే హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పిలుపు నిచ్చారు. లేనట్లయితే హిందువులైన మన పై దాడులు జరిగినప్పుడు ఇతర హిందువులు రారన్నారు. ఆర్మూర్ లో ఇస్కాన్ మందిర నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ చైర్ పర్సన్ ఈ ఫైల్ పై సంతకం చేస్తే ఆ స్థలంలో భవ్య మందిరం నిర్మాణం అవుతుందన్నారు. హిందువుల పై దాడులు చేస్తే ఇకనుంచి సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం జగన్నాథ రథయాత్ర త్రాడును లాగి యాత్రను ప్రారంభించారు. అనంతరం ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గోనె లహరి రఘు మాట్లాడారు. ఇస్కాన్ జగన్నాథ రథోత్సవంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. తరువాత ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడారు. జగన్నాథుని రథోత్సవంలో హిందువులు భారీ సంఖ్యలో పాల్గొని హిందువుల ఐక్యతను చాటడం గొప్ప విషయం అన్నారు.
జగన్నాథుని కృపతో వర్షాలు కురిసి రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని ఈరవత్రి రాజశేఖర్ ఆకాంక్షించారు. ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఎలాంటి ఉద్రిక్త వాతావరణం ఏర్పాటు కాకుండా ముందస్తుగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్, ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పెద్దల గంగారెడ్డి, కౌన్సిలర్ లు బొట్టు నాగరాజు, పాన్ శ్రీనివాస్, పోచంపాడు శ్రీనివాస్, దోండి కవిత ఈశ్వర్, అనూష అరుణ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మంథని వెంకట్రామ్ రెడ్డి, జిజి ఫౌండేషన్ చైర్మన్ గుజరాతి నివేదన్, మాజీ కౌన్సిలర్ కొంతం మురళి, బిజెపి నాయకులు పోల్కం వేణు, జాన్కంపేట్ సంతోష్ రెడ్డి, ఫౌండేషన్ సభ్యులు రాంప్రసాద్, అర్గుల్, నర్సయ్య, వినోద్, దినేష్, ఇస్కాన్ సభ్యులు పాల్గొన్నారు.






