- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రహరీ దూకి స్టూడెంట్ పరారీ
హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేని ఒక స్టూడెంట్ మూత్ర విసర్జన చేసస్తానని వెళ్లి, ప్రహరీ గోడ ఎక్కిజంప్ అయిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో బుధవారం తీవ్ర కలకలం రేపింది.

దిశ, భిక్కనూరు : హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేని ఒక స్టూడెంట్ మూత్ర విసర్జన చేసస్తానని వెళ్లి, ప్రహరీ గోడ ఎక్కిజంప్ అయిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో బుధవారం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన కే రుత్విక్ ఐదవ తరగతి చదువుతున్నాడు. అయితే హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేని సదర్ విద్యార్థి, ఉదయం ప్రార్థనకు వెళ్లి ఆ తర్వాత ఎస్కేప్ అయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా పాఠశాల సిబ్బందికి తెలియడంతో వారు భిక్కనూరు పోలీస్ స్టేషన్ కు చేరుకొని కంప్లైంట్ చేశారు. వెంటనే సీఐ జగడం నరేష్ ఆధ్వర్యంలోని స్పెషల్ టీంలతో పాటు, క్రైమ్ పార్టీ పోలీసులు బాలుడి ఆచూకీ కోసం విస్తృతంగా గాలించారు.
రైల్వే స్టేషన్ తో పాటు చుట్టుముట్టు గ్రామాలలో వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో, ఎందుకైనా మంచిదని స్వగ్రామంలోని పాఠశాలకు వెళ్లారు. ఐదవ తరగతిలో కూర్చొని శ్రద్ధగా పాఠాలు వింటుండగా పోలీసులు గమనించారు. వెంటనే స్టూడెంట్ ను అదుపులోకి తీసుకొని సదర్ పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఎందుకు పాఠశాల నుంచి పరారయ్యావని పోలీసులు ప్రశ్నించగా, ఆ స్కూల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేకనే, తప్పించుకొని ఇక్కడికి వచ్చానని వివరించాడు. నాలుగు గంటల వ్యవధిలో స్టూడెంట్ ఆచూకీ లభించడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం స్టూడెంట్ ను పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో మిస్సింగ్ కథ సుఖాంతమైంది.






