- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏ గ్రామంలోనూ మంచినీటి కొరత ఉండొద్దు : అధికారులకు ఆదేశం
దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ అధికారులను ఆదేశించారు.

దిశ, దేవరకొండ టౌన్ : దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ అధికారులను ఆదేశించారు. స్థానిక నియోజకవర్గ కేంద్రంలో గ్రామీణ నీటిపారుదల శాఖ (RWS), మిషన్ భగీరథ అధికారులతో ఆయన గురువారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న తాగునీటి పరిస్థితిని ఎమ్మెల్యే సమగ్రంగా సమీక్షించారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా, పైప్‌లైన్ల నిర్వహణ, మోటార్ల పనితీరు, నీటి నిల్వ సామర్థ్యం, లీకేజీల నివారణ, మరమ్మతులు మరియు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల పై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కేవలం వేసవి కాలంలోనే కాకుండా, అన్ని కాలాల్లోనూ ప్రజలకు మంచినీటి కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలతో పనిచేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
గ్రామాల్లో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే అధికారులు వెంటనే స్పందించి, యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు నిరంతరాయంగా అందేలా నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ "ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. దేవరకొండ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలోనూ మంచినీటి సమస్య అనేదే వినపడకూడదన్నదే నా ప్రధాన లక్ష్యం. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి, పరస్పర సమన్వయంతో పని చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో గ్రామీణ నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు, ఇంజనీర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.






