లేడీ ఆఫీసర్‍పై దాడి.. BRS మాజీ ఎమ్మెల్యే సోదడురు సోనేరు కృష్ణారావుకు జైలు శిక్ష

by Prasad Jukanti |   (  Updated:2026-07-16 12:49:10  IST  )

కాగజ్‌నగర్ ఎఫ్‌ఆర్‌ఓ అనితపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ సహా 8 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది.

లేడీ ఆఫీసర్‍పై దాడి.. BRS మాజీ ఎమ్మెల్యే సోదడురు సోనేరు కృష్ణారావుకు జైలు శిక్ష
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‍నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చోలే అనితపై దాడి కేసు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు సహా మరో 8 మందికి ఆదిలాబాద్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఆరునెలలు జైలు శిక్ష విధిస్తూ తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది.

కర్రలతో దాడి:

2019లో కాగజ్ నగర్ డివిజన్ పరిధిలోని సార్సాల గ్రామంలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు భూమిని చదును చేస్తుండగా కర్రలతో వచ్చిన గ్రామస్తులు కోనేరు కృష్ణారావు ఆధ్వర్యంలో అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత తీవ్రంగా గాయపడ్డారు. అయితే కోనేరు కృష్ణ గ్రామస్తులను రెచ్చగొట్టారని, తనపై దాడి చేశారని అనిత ఆరోపించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ కేసులో కోర్టు తాజాగా నిందితులకు జైలు శిక్ష ఖరారు చేసింది.

Next Story