టీంఇండియా స్టార్ క్రికెటర్ కు బిగ్ షాక్.. 2027 వరల్డ్ కప్ నుంచి ఔట్!

by Muthe.Rajitha |

టీంఇండియా స్టార్ క్రికెటర్ కు బిగ్ షాక్ తగిలింది. జట్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే భవిష్యత్తుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

టీంఇండియా స్టార్ క్రికెటర్ కు బిగ్ షాక్.. 2027 వరల్డ్ కప్ నుంచి ఔట్!
X

దిశ, వెబ్ డెస్క్ : టీంఇండియా స్టార్ క్రికెటర్ కు బిగ్ షాక్ తగిలింది. జట్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా వన్డే భవిష్యత్తుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న 2027 వన్డే ప్రపంచ కప్‌ కోసం బీసీసీఐ(BCCI) సెలక్టర్లు ఇప్పటి నుంచే సుదీర్ఘ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే భవిష్యత్తు ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్ (Axar Patel), వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) వంటి యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపుతూ జడేజాను వన్డేల నుంచి పక్కన పెట్టేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ నుంచి కూడా జడేజాను సెలక్టర్లు తప్పించారు. దీనికి గల ప్రధాన కారణం వన్డేల్లో అతని ఇటీవలి పేలవమైన ప్రదర్శనే. గత కొన్ని వన్డేల్లో అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తగ్గడం, అలాగే సగటు ఓవర్లకు వికెట్లు తీయడంలో తడబడుతుండటంతో సెలక్టర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.

2027 ప్రపంచ కప్ లక్ష్యంగా నిర్ణయాలు

2027 వన్డే వరల్డ్ కప్ సమయానికి జడేజా వయసు దాదాపు 38-39 ఏళ్లు దాటుతుంది. దక్షిణాఫ్రికాలోని వేగవంతమైన, బౌన్సీ పిచ్‌లపై ఒకే ఒక స్పిన్ ఆల్‌రౌండర్‌కు మాత్రమే స్థానం దక్కే అవకాశం ఉంటుంది. దాంతో, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అక్షర్ పటేల్‌ను ప్రధాన స్పిన్ ఆల్‌రౌండర్‌గా మార్చడానికి మేనేజ్‌మెంట్ సన్నద్ధమవుతోంది. అక్షర్ ఇటీవల వన్డేల్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతమైన ఫామ్‌తో రాణిస్తూ జడేజా స్థానాన్ని భర్తీ చేయగలనని నిరూపించుకున్నాడు. మరోవైపు వాషింగ్టన్ సుందర్ కూడా అదనపు బ్యాకప్‌గా జట్టుకు బలాన్ని ఇస్తున్నాడు. జడేజా 2027 వరల్డ్ కప్ ఆడాలనే పట్టుదలతో ఉన్నప్పటికీ, సెలక్షన్ కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలు, యువ ఆటగాళ్ల అద్భుతమైన ప్రదర్శనలు చూస్తుంటే వన్డే క్రికెట్‌లో జడేజా ప్రస్థానం దాదాపు ముగింపు దశకు చేరుకుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Next Story