- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి.. 120 మందికి గాయాలు
by Muthe.Rajitha |
ఒడిశాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పూరీలో జరుగుతున్న జగన్నాథుడి రథయాత్రలో గురువారం ఘోర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఒడిశాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం పూరీలో జరుగుతున్న జగన్నాథుడి రథయాత్రలో గురువారం ఘోర విషాదం చోటుచేసుకుంది. జగన్నాథ రథయాత్ర చూసేందుకు భారీగా తరలివచ్చిన జనసమూహాన్ని నియంత్రించే క్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట లాంటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా, సుమారు 100 నుండి 120 మంది వరకు తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ఆలయ కమిటీ, పోలీసు ఉన్నతాధికారులు అదనపు బలగాలతో రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా గత ఏడాది రథయాత్రలోనూ తొక్కిసలాట జరగగా.. 3 ముగ్గురు మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. ఈ ఏడాది కూడా అదే తరహా ప్రమాదం పునరావృతం కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
Next Story






