- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్ ఫార్మర్ సమస్యతో ప్రజల అవస్థలు
by Batti.Sumithra |
పినపాక మండలం తోగ్గూడెం గ్రామంలోని పై గుంపు ప్రజలు గత కొంతకాలంగా ట్రాన్స్ఫార్మర్ సమస్యతో కరెంటు సరిగా రాక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.

X
దిశ, పినపాక : పినపాక మండలం తోగ్గూడెం గ్రామంలోని పై గుంపు ప్రజలు గత కొంతకాలంగా ట్రాన్స్ఫార్మర్ సమస్యతో కరెంటు సరిగా రాక ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ పురాతనమైనది కావడం, సామర్థ్యానికి మించి కనెక్షన్ లు ఉండటంతో తరచూ ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. చట్ట విరుద్ధమైన సింగిల్ ఫేస్ మోటార్లు 24 గంటలూ వాడుతుండటం ఈ సమస్యకు ప్రధాన కారణమని గ్రామస్థులు తెలిపారు. రాత్రి వేళల్లో ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని తద్వారా దోమల బెడద ఎక్కువై జ్వరాల బారిన పడుతున్నట్లు తెలిపారు. సంబంధిత విద్యుత్ శాఖాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Next Story






