మర్కోడు అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలను తనిఖీ చేసిన తహసీల్దార్

by Batti.Sumithra |

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా మర్కోడు అంగన్‌వాడీ కేంద్రాన్ని బీఎల్‌వోతో కలిసి తహసీల్దార్ ఉమారాణి గురువారం తనిఖీ చేశారు.

మర్కోడు అంగన్‌వాడీ కేంద్రం, పాఠశాలలను తనిఖీ చేసిన తహసీల్దార్
X

దిశ, ఆళ్లపల్లి : ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా మర్కోడు అంగన్‌వాడీ కేంద్రాన్ని బీఎల్‌వోతో కలిసి తహసీల్దార్ ఉమారాణి గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న సేవలు, పోషకాహారం, నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి, మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు వండిన ఆహారం నాణ్యత, పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందిస్తున్న భోజనం నాణ్యత, రుచి పై ఆరా తీశారు. అధికారులు విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు.

Next Story