ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను పరామర్శించిన గవర్నర్‌

by Muthe.Rajitha |   (  Updated:2026-07-16 10:56:05  IST  )

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను గురువారం ఉదయం ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ను పరామర్శించిన గవర్నర్‌
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను గురువారం ఉదయం ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన గవర్నర్, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ముంబైలో జరిగిన కుడి భుజం శస్త్రచికిత్స తర్వాత పవన్ కోలుకుంటున్న తీరును విచారించారు. వైద్యుల సూచనలను ఖచ్చితంగా పాటించి, త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ప్రజా విధుల్లోకి రావాలని గవర్నర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఇటీవలే ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో పవన్ కళ్యాణ్‌కు కుడి భుజానికి సర్జరీ జరగగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రాబోయే కొన్ని వారాల తర్వాత పవన్‌కు ఫిజియోథెరపీ ప్రారంభం కానుందని, ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు.

.

Next Story