ట్రైసైకిల్‌పై హెల్మెట్.. బైక్‌పై మాత్రం నో హెల్మెట్!

by Ratna Kumari |

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అధికారులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.

ట్రైసైకిల్‌పై హెల్మెట్.. బైక్‌పై మాత్రం నో హెల్మెట్!
X

దిశ, తంగళ్లపల్లి : రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అధికారులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది వాహనదారుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. అయితే తంగళ్లపల్లిలో కనిపించిన ఓ దృశ్యం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ఓ దివ్యాంగుడు ట్రైసైకిల్‌పై ప్రయాణిస్తూ తనకు తప్పనిసరి కాకపోయినా భద్రత కోసం హెల్మెట్ ధరించాడు. అదే సమయంలో పక్కనే బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు మాత్రం చట్టప్రకారం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా హెల్మెట్ లేకుండానే ప్రయాణించడం కనిపించింది. ఈ దృశ్యం రోడ్డు భద్రత విషయంలో బాధ్యత ఎవరిది అనే ప్రశ్నను ముందుకు తెచ్చింది. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ తన భద్రతను ముందుగా భావించి హెల్మెట్ ధరించిన దివ్యాంగుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. "వైకల్యం శరీరానికే..బాధ్యతాయుతమైన ఆలోచన మనసుకు సంబంధించినది" అనే సందేశాన్ని ఈ ఘటన స్పష్టంగా చాటుతోంది. ట్రాఫిక్ నిబంధనలు శిక్షల భయంతో కాకుండా ప్రాణాల భద్రత కోసం పాటించాలనే విషయాన్ని ఈ దృశ్యం మరోసారి గుర్తు చేసింది.

Next Story