సీదిరి అప్పలరాజు కుమారుడి వ్యహహారం..హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-16 10:43:35  IST  )

విజయనగరం జిల్లా కాశీబుగ్గలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ కారణం కావడంతో ఆయనపై కేసు నమోదు అయింది...

సీదిరి అప్పలరాజు కుమారుడి వ్యహహారం..హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా కాశీబుగ్గలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ కారణం కావడంతో ఆయనపై కేసు నమోదు అయింది. అయితే ఈ కేసులో తొలుత మరో వ్యక్తి పోలీసు స్టేషన్ లో లొంగిపోయారు. ఆ తర్వాత అసలు విషయాలు వెలుగులోకి రావడంతో అప్పలరాజు కుమారుడు ఆరవ్ గుట్టు రట్టు అయింది. బైక్ పై వెళ్తూ గొర్రెల కాపరిని ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. కానీ కేసును తప్పుదోవ పట్టించేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సీదిరి అప్పలరాజు మాజీ మంత్రి అయి ఉండి కేసు తప్పించే ప్రయత్నం చేయడంపై కూటమి నేతలు తీవ్రంగా విమర్శలు కురిపిస్తున్నారు.

అన్నింటినీ రాజకీయం చేస్తున్నారు

ఈ నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. సీదిరి కుమారుడి విషయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. అమాయకుడిని బలి చేసే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. విశాఖ బోటు ప్రమాదంపై ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందని గుర్తు చేశారు. సత్పవర్తన లేని పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ వెర్ఫేర్‌ను వైసీపీ నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నింటినీ రాజకీయం చేస్తున్నారని అనిత మండిపడ్డారు. భోగాపురం ఎయిర్ పోర్టును త్వరలోనే ప్రారంభంకానుందని అనిత పేర్కొన్నారు.

Next Story