- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NBK111 నుంచి బిగ్ అప్‌డేట్.. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న బాలయ్య
NBK111 తదుపరి షెడ్యూల్ కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరగనున్నట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పలు సందర్భాల్లో ఆయన ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా సినిమా షూటింగ్‌లు నిర్వహించాలని, తద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. అలాగే తన సినిమాల షూటింగ్‌ను కూడా సాధ్యమైనంత వరకు ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్వహిస్తానని వెల్లడించారు. బాలకృష్ణ చెప్పిన మాటను మరోసారి నిలబెట్టుకుంటున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా అధికారిక టైటిల్ ప్రకటించకపోవడంతో, ప్రస్తుతం 'NBK111' అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ కొనసాగుతోంది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొంత భాగం షూటింగ్ పూర్తయింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌ను కాకినాడ మరియు రాజమహేంద్రవరం (రాజమండ్రి) పరిసర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీంతో బాలకృష్ణ చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్‌లకు ప్రాధాన్యత ఇస్తుండటంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఈ సినిమాను ఈ ఏడాది దసరా లేదా డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.






