- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ ధరకు అమ్ముడుపోయిన ‘వృషకర్మ’ నాన్-థియేట్రికల్ రైట్స్!
ప్రముఖ ఓటీటీ, శాటిలైట్ సంస్థ అయిన జీ ఛానెల్ ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్‌ను దాదాపు రూ. 50 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘వృషకర్మ’. ఈ సినిమా విడుదల కాకముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఇండస్ట్రీ వర్గాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన నాన్-థియేట్రికల్ డీల్స్ చాలా భారీ రేటుకు క్లోజ్ అయినట్లు ఫిల్మ్ నగర్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ, శాటిలైట్ సంస్థ అయిన జీ ఛానెల్ ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్‌ను దాదాపు రూ. 50 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రూ. 50 కోట్ల భారీ డీల్ కుదరడంతో, ఈ సినిమా బడ్జెట్‌లో సగానికి పైగా అమౌంట్ కేవలం ఈ ఒక్క రైట్స్ ద్వారానే రికవరీ అయిపోయిందని అంచనా వేస్తున్నారు.
దీనికి తోడు మ్యూజిక్ రైట్స్, అలాగే హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కూడా కలిపితే సినిమా బడ్జెట్‌లో మెజారిటీ భాగం ప్రీ-రిలీజ్ బిజినెస్ ద్వారానే వెనక్కి వచ్చేస్తుందని సమాచారం. నిర్మాతలకు ఇది చాలా సేఫ్ ప్రాజెక్ట్‌గా మారబోతోందని టాక్. నాగచైతన్య కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డ్ అని చెప్పవచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే.. ‘విరూపాక్ష’ వంటి సూపర్ హిట్ చిత్రంతో మెప్పించిన టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. కార్తీక్ దండు మార్క్ సస్పెన్స్ ఎలిమెంట్స్, మిస్టికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీని డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లా్న్ చేస్తున్నట్లు తెలుస్తోంది.






