నకిలీ పత్రాలతో భూ కబ్జా.. టీఆర్ఎస్ నేత రంగినేని శ్రీనివాస్ అరెస్ట్

by Taduka Kalyani |

నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు బ్యాంకును మోసం చేసిన కేసులో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నేత రంగినేని శ్రీనివాస్ ను అరెస్టు చేసి,ఆయన తండ్రిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ వన్‌టౌన్ సీఐ బి.సునీల్ కుమార్ తెలిపారు.

నకిలీ పత్రాలతో భూ కబ్జా.. టీఆర్ఎస్ నేత రంగినేని శ్రీనివాస్ అరెస్ట్
X

దిశ,ఆదిలాబాద్ : నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేయడంతో పాటు బ్యాంకును మోసం చేసిన కేసులో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) నేత రంగినేని శ్రీనివాస్ ను అరెస్టు చేసి,ఆయన తండ్రిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ వన్‌టౌన్ సీఐ బి.సునీల్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ నేత రంగినేని శ్రీనివాస్ ను అరెస్టు చేయగా, అతని తండ్రి రంగినేని సూర్యప్రకాశ్ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.1979లో కొనుగోలు చేసిన స్థలాన్ని లీజుకు తీసుకున్న నిందితులు, లీజు గడువు ముగిసిన తర్వాత నకిలీ మున్సిపల్ పత్రాలు, పట్టా ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆస్తిని తమ పేరుపై మార్చుకున్నారని తెలిపారు. అనంతరం అదే పత్రాలతో ఎస్‌బీఐ నుంచి రూ.49 లక్షల రుణం పొందినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు. నకిలీ పత్రాల తయారీలో సహకరించిన ఇతర వ్యక్తుల పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని, ఎవరైనా ప్రమేయం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story