- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇస్రో’ను వరుసగా వీడుతున్న సైంటిస్టులు.. ఎగ్జిట్ రూల్స్ కఠినతరం చేసిన కేంద్రం
‘ఇస్రో’ నుంచి 100 మందికి పైగా సైంటిస్టులు రాజీనామా చేయడంతో కలకలం రేపుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సంస్థ నుంచి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో కేంద్ర అంతరిక్ష శాఖ (DoS) అప్రమత్తమైంది. మరికొద్దిరోజుల్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ‘గగన్‌యాన్’ వంటి వ్యోమగాముల మిషన్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు గ్రేడ్-1 శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
100 మందికి పైగా సైంటిస్టుల రాజీనామా..
కాగా, ఇటీవలి కాలంలో ఇస్రో నుంచి దాదాపు 100 మందికి పైగా సైంటిస్టులు. ఇంజినీర్లు రాజీనామా చేయడం కలవరపెడుతోంది. కేవలం యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC) నుంచి సుమారు 80 మంది, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) నుంచి కనీసం 20 మంది రిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. రాజీనామా చేసిన వారిలో ‘చంద్రయాన్-3’ సిమ్యులేషన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆదిత్య నల్లపల్లి, ‘LVM-’3 ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ జోసెఫ్, అలాగే స్పేస్‌డెక్స్ (SpaDeX) ప్రాజెక్ట్ డైరెక్టర్ వంటి సీనియర్ స్టాఫ్, అఫీషియల్స్ ఉంటడం గమనార్హం.
కొత్త నిబంధనలు ఇవే..
ఇస్రో విడుదల చేసిన తాజా అంతర్గత మెమోరాండం ప్రకారం.. ‘గగన్‌యాన్’ వంటి వ్యూహాత్మక, దేశ ప్రతిష్టాత్మక మిషన్లలో పనిచేస్తున్న గ్రేడ్-1 అధికారుల రాజీనామాలను ఇకపై సాధారణంగా ఆమోదించరు. 2020 నాటి నిబంధనల ప్రకారం ఇస్రో సెంటర్ డైరెక్టర్లకే రాజీనామాలు ఆమోదించే అధికారం ఉండేది. కానీ తాజా మార్పుల ప్రకారం సెంటర్ డైరెక్టర్లు ఈ అభ్యర్థనలను తమ సిఫార్సులతో నేరుగా ఢిల్లీలోని కేంద్ర అంతరిక్ష శాఖకు (DoS) పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా సదరు శాస్త్రవేత్తలు తమ బాధ్యతలను పూర్తిగా పూర్తి చేసిన తర్వాతే వారిని విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించారు. మరోవైపు సైంటిస్టుల రాజీనామాలపై ఇస్రో చైర్మన్ నారాయణన్ స్పందించారు. పెద్ద సంస్థలలో ఉద్యోగుల మార్పు సహజమని, ప్రాజెక్టులకు అంతరాయం కలగకుండా బాధ్యతలను ఇతరులకు బదిలీ చేస్తున్నట్లుగా తెలిపారు. ‘గగన్‌యాన్’ అనుకున్న సమయానికే జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక ఖాళీలను భర్తీ చేయడానికి దాదాపు 1,050కి పైగా శాస్త్రవేత్తలు, సాంకేతిక, పరిపాలనా పోస్టుల భర్తీకి ‘ఇస్రో’ భారీ నియామక ప్రక్రియను చేపడుతోందని అధికారులు వెల్లడించారు.






