- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి విద్యార్థులు సహకరించాలి : మోతే ఎస్సై బి.లచ్చిరెడ్డి
మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని మోతే ఎస్‌ఐ బి.లచ్చిరెడ్డి అన్నారు.

దిశ, మోతే: మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని మోతే ఎస్‌ఐ బి.లచ్చిరెడ్డి అన్నారు. గురువారం మోతే మండలంలోని మామిళ్లగూడెం వెంకటేశ్వర పాఠశాలలో మోతే పోలీసుల ఆధ్వర్యంలో 'డ్రగ్స్ రహిత సమాజం' అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకుని, చదువు పై పూర్తి దృష్టి సారించాలని సూచించారు. సరదా కోసం మాదకద్రవ్యాలకు అలవాటు పడితే జీవితంతో పాటు కుటుంబం కూడా తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, చట్టపరంగా కఠిన చర్యలకు కూడా దారి తీస్తాయని వివరించారు. పాఠశాల పరిసరాల్లో లేదా గ్రామాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే మోతే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్రతి విద్యార్థి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






