- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ యాక్షన్ డ్రామా ‘ఎనిమీ ఆఫ్ స్మగ్లర్స్’.. ఆసక్తిని రేకెత్తిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్
ఇండస్ట్రీలో క్రైమ్, స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే హై-వోల్టేజ్ కథలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అదే జోనర్‌లో ఈ మూవీ రాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించారు.

దిశ, సినిమా: యంగ్ హీరో శరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్స్’కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో మేకర్స్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇండస్ట్రీలో క్రైమ్, స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే హై-వోల్టేజ్ కథలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అదే జోనర్‌లో ఈ మూవీ రాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించారు. "ప్రతి పోర్ట్‌కు స్మగ్లర్స్ ఉంటారు.. ఆ స్మగ్లర్స్‌ను అడ్డుకునే అతిపెద్ద శత్రువే కస్టమ్స్ డిపార్ట్‌మెంట్" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్ జత చేశారు. ఇక విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో వర్షంలో సముద్రం మధ్యలో ఆగిపోయిన ఓ పెద్ద నౌకను లైట్లతో చూపించారు.
ఈ విభిన్నమైన యాక్షన్ డ్రామాను దర్శకుడు సమయ మురళి తెరకెక్కిస్తున్నారు. స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను పట్టుకోవడానికి కస్టమ్స్ అధికారులు వేసే ప్లాన్స్, ఇరు వర్గాల మధ్య జరిగే మైండ్ గేమ్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో హైలైట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక పరంగా కూడా ఎక్కడా తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సీనియర్ నటుడు జె.డి.చక్రవర్తి, వర్సటైల్ యాక్ట్రెస్ రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు-దర్శకుడు లాల్, స్నేహా, కాళీ వెంకట్, బాలా శరవణన్, జాఫర్ సాదిక్, వినోదిని, మైమ్ గోపి లాంటి టాలెంటెడ్ నటీనటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పోర్ట్ నేపథ్యంలో సాగే ఈ రసవత్తరమైన డ్రామాకు సంబంధించిన మరిన్ని వివరాలు, టీజర్ అప్‌డేట్స్ త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.






