- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైదాబాద్ స్కూల్ 'కల్మా' వివాదంపై డీసీపీ ఖారే కిరణ్ ప్రభాకర్ అధికారిక ప్రకటన!
సైదాబాద్ స్కూల్ ఘటనపై డీసీపీ కిరణ్ ప్రభాకర్ ప్రకటన.. నిబంధనలు ఉల్లంఘించిన టీచర్‌ను శాశ్వతంగా తొలగించిన స్కూల్ యాజమాన్యం! టాగ్స్:

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ పాతబస్తీ సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'సక్సెస్ స్కూల్' లో రెండో తరగతి విద్యార్థికి 'కల్మా' చదవాలని హోంవర్క్ ఇచ్చిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై చార్మినార్ జోన్ డీసీపీ ఖారే కిరణ్ ప్రభాకర్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. సదరు క్లాసులో మొత్తం 25 మంది విద్యార్థులుండగా, అందులో 24 మంది ముస్లిం విద్యార్థులు, కేవలం ఒక్కరు మాత్రమే హిందూ విద్యార్థి ఉన్నారని డీసీపీ తెలిపారు. అక్కడ పనిచేసే ఒక మహిళా ఉపాధ్యాయురాలు విద్యార్థులందరూ కల్మా చదువుకురావాలని హోంవర్క్ డైరీలో రాయడం విద్యా విధానం తో పాటు సదరు పాఠశాల నియమావళిని పూర్తిగా ఉల్లంఘించడమేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు సాయంత్రం పాఠశాల యాజమాన్యంతో పాటు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించారని డీసీపీ వివరించారు. ఈ వ్యవహారంపై స్పందించిన స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నిబంధనలు ఉల్లంఘించిన సదరు ఉపాధ్యాయురాలిని (షేక్ ఆయేషా పర్వీన్) ఉద్యోగంలోంచి శాశ్వతంగా తొలగించినట్లు (Terminated) వెల్లడించారు. యాజమాన్యం తీసుకున్న ఈ తక్షణ చర్య పట్ల విద్యార్థి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారని, అందువల్ల ఈ కేసులో ఎలాంటి అధికారిక లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని, ఎఫ్‌ఐఆర్ (FIR) కూడా నమోదు కాలేదని డీసీపీ కిరణ్ ప్రభాకర్ స్పష్టం చేశారు.






