- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటు హక్కును పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత : ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి
ప్రతి భారత పౌరుడికి ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు అని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకుండా పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు.

దిశ, నిజామాబాద్ రూరల్ : ప్రతి భారత పౌరుడికి ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు ఓటు హక్కు అని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకుండా పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. గురువారం మోపాల్ మండలం మోపాల్, ముదక్‌పల్లి గ్రామపంచాయతీల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను, ప్రజల నుండి వస్తున్న అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. డబుల్ ఓట్లు, నివాస మార్పు (షిఫ్టింగ్), మరణించిన ఓటర్ల పేర్ల తొలగింపు వంటి అంశాల్లో అనుసరిస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సహకారంతో ఇప్పటికే 85 శాతం మేర ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తవడం అభినందనీయమని అన్నారు. మిగిలిన అర్హులైన ప్రతి ఓటరును కూడా ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసి ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో రూపొందించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరచడానికి కుట్ర
బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తోందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. రాజ్యాంగబద్ధ సంస్థలను ప్రభావితం చేయడం, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అయోధ్య రామాలయ విరాళాల వ్యవహారంలోనూ జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఓటు హక్కును పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..
ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఓటు హక్కును పరిరక్షించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరు మహాశయులు తప్పనిసరిగా ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని తమ విలువైన ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు. ప్రజల అప్రమత్తతతోనే ప్రజాస్వామ్యం మరింత బలోపేతమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఐసీడీఎంఎస్ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.






