మున్సిపల్ కమిషనర్‌గా మారుతి ప్రసాద్ బాధ్యతల స్వీకరణ

by Jakkula.Mamatha |

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మున్సిపల్ కమిషనర్‌గా మారుతి ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

మున్సిపల్ కమిషనర్‌గా మారుతి ప్రసాద్ బాధ్యతల స్వీకరణ
X

దిశ, చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మున్సిపల్ కమిషనర్‌గా మారుతి ప్రసాద్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నియోజకవర్గంలోని కేతన పెళ్లిలో మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న మారుతీ ప్రసాద్‌ను చెన్నూరుకు బదిలీ చేశారు. చెన్నూరులో కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న మురళీకృష్ణను కేతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్‌గా బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన కమిషనర్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వినయ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. మంత్రి వివేక్ వెంకటస్వామి, కౌన్సిల్ సభ్యుల సహాయ సహకారాలతో చెన్నూరు పట్టణాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తానని ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన అన్నారు.

Next Story