లిక్కర్ కేసులో కీలక పరిణామం: చంచల్‌గూడ నుంచి తరలింపు

by Gantepaka Srikanth |

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు' దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ED) మరింత వేగవంతం చేసింది.

లిక్కర్ కేసులో కీలక పరిణామం: చంచల్‌గూడ నుంచి తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు' దర్యాప్తును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ED) మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో అరెస్టయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కీలక నిందితులను కోర్టు అనుమతితో ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ రోజు ఉదయం నిందితులు రాజ్‌కెసిరెడ్డి, వాసుదేవరెడ్డి, సునీల్ కుమార్‌లను హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర కారాగారం నుంచి భారీ భద్రత నడుమ బషీర్ బాగ్‌లోని ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు.

ఈ కుంభకోణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, అక్రమ నిధుల మళ్లింపు (మనీ లాండరింగ్) అంశాలపై ఈ ముగ్గురు నిందితులను ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించనున్నారు. మద్యం రవాణాలో జరిగిన అక్రమాలు, ఈ వ్యవహారంలో వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులకు సంబంధించిన కీలక ఆధారాలను రాబట్టేందుకు అధికారులు విచారణా సరళిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కస్టడీ విచారణతో ఈ కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

Next Story