- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓడిపోతే జీవితంలో మళ్లీ పోటీ చేయం: శివప్రసాద్ రెడ్డి సంచలన సవాల్
ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. అయితే రాజకీయం మాత్రం ఇప్పటికే వేడెక్కింది. కూటమి ప్రభుత్వం పాలనలో తమదైన శైలితో ముందుకు వెళ్తోంది. అమరావతితో పాటు పలు ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ దూసుకుపోతోంది....

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో ఎన్నికల(Election)కు చాలా సమయం ఉంది. అయితే రాజకీయం(Politics) మాత్రం ఇప్పటికే వేడెక్కింది. కూటమి ప్రభుత్వం పాలనలో తమదైన శైలితో ముందుకు వెళ్తోంది. అమరావతి(Amaravati)తో పాటు పలు ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ దూసుకుపోతోంది. అయితే ప్రతిపక్షం వైసీపీ రాజకీయం మాత్రం రసకందకాయంగా ఉంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్(Ys Jagan) మావిగన్‌తో ముందుకెళ్తున్నారు.
కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysrcongress Party) నాయకులు మాత్రం భిన్నంగా రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంతో ఏదో ఒక అంశాన్ని తీసుకుని ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కోస్తాంధ్రలో అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లు పార్టీ కార్యక్రమాలు ఉత్సహంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ముందుకెళ్తున్నారు. రాయలసీమలో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాటల తూటలు పెల్చుతున్నారు. అధికార పార్టీ నేతలకు సవాళ్లు విసిరుతూ ముందుకెళ్తున్నారు.
అయితే తాజాగా ప్రొద్దుటూరు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి(Proddutur Rachamallu Sivaprasad Reddy) చేసిన సవాల్ మాత్రం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి వైఎస్ జగన్ అవరోథం కాదని, రాయలసీమ రత్నం అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ప్రజల వద్ద రెఫరెండం పెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమా అని సవాల్ చేశారు. తాము ఓడిపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జీవితాంతం పోటీ చేయదని ఛాలెంజ్ చేశారు. రాష్ట్రానికి జగన్ కేన్సర్ గడ్డ కాదన్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు దొరికిన అమూల్యమైన సంపద జగన్ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.






