- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లాక్ శారీలో సైడ్ అందాలతో మెస్మరైజ్ చేస్తున్న యాషిక ఆనంద్
బ్లాక్ శారీలో యాషిక ఆనంద్ అందాల ఆరబోత.

దిశ, వెబ్ డెస్క్: బ్యూటిఫుల్ నటి యాషిక ఆనంద్ ప్రస్తుతం తన కెరీర్‌ను జోరుగా కొనసాగిస్తోంది. ఢిల్లీలో జన్మించిన ఈ భామ, తమిళ చిత్రసీమలో మంచి గుర్తింపు సంపాదించడంతో చెన్నైలో స్థిరపడింది.
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన యాషిక, బుల్లితెరపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, 2016లో విడుదలైన 'ధురువంగల్ పత్తినారు' చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. అనంతరం 'ఇరుట్టు అరైయిల్ మురట్టు కుత్తు' సినిమాతో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
ఇప్పటివరకు నేరుగా తెలుగు సినిమాలో నటించకపోయినా, తమిళ్-తెలుగు ద్విభాషా చిత్రం 'నోటా'లో ముఖ్య పాత్ర పోషించింది. సినిమాల్లో తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యాషిక, సోషల్ మీడియాలోనూ అదే జోరును కొనసాగిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో పలుచటి నలుపు రంగు చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ ధరించిన ఆమె, స్టైలిష్‌గా చీర కొంగును పక్కకు జరిపి సైడ్, ఫ్రంట్ యాంగిల్స్‌లో తన అందాలను హైలైట్ చేస్తూ కెమెరాకు పోజులిచ్చింది.
నుదిటిపై చిన్న బొట్టు, పెద్ద ఇయర్‌రింగ్స్, ముక్కుపుడక ఆమె లుక్‌కు మరింత ఆకర్షణను తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Photos Courtesy: Instagram






