- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
మధ్యప్రదేశ్‌లో సహజీవనంపై కఠిన చట్టాలు తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వం ఒక ముసాయిదా బిల్‌ను సిద్ధం చేసింది. పెళ్లి చేసుకుంటే ఎలాంటి నియమాలు వర్తిస్తాయో.. అచ్చం అలాంటి నియమాలే సహజీవనానికి కూడా వర్థించేలా బిల్ రూపొందించింది.

దిశ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లో సహజీవనంపై కఠిన చట్టాలు తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వం ఒక ముసాయిదా బిల్‌ను సిద్ధం చేసింది. పెళ్లి చేసుకుంటే ఎలాంటి నియమాలు వర్తిస్తాయో.. అచ్చం అలాంటి నియమాలే సహజీవనానికి కూడా వర్థించేలా బిల్ రూపొందించింది. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌ను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ప్రతిపాధించింది. జంటల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఇవ్వాలని స్పష్టం చేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్‌లో ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోనట్లయితే మూడు నెలల జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది. ఒకవేళ రిలేషన్‌షిప్ ముగిస్తే దానికి కూడా అధికారిక రద్దు తప్పనిసరి అని స్పష్టం చేసింది.
సహజీవనం చేసే జంట తల్లిదండ్రులకు కూడా తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని చెబుతోంది. అంతేకాకుండా ఒకవేళ భాగస్వామిని వదిలేస్తే విడాకులు తీసుకునప్పుడు చెల్లించినట్టుగా భరణం కూడా చెల్లించాల్సిందేనని తెలిపింది. జూలై 20న ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ చట్టం గనక అమలులోకి వస్తే లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న జంటలపై పెను ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా యునిఫామ్ సివిల్ కోడ్ పై చర్చ జరుగుతుండగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.
సోనమ్ వాంగ్‌చుక్ ప్రాణాలు కాపాడేందుకు ఏం చేయాలో అది చేయండి.. కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం






