- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షార్ట్ సర్క్యూట్‌తో కార్ల షెడ్డులో అగ్నిప్రమాదం
by Jakkula.Mamatha |
షార్ట్ సర్క్యూట్‌తో కార్ల షెడ్డు దగ్ధమైన సంఘటన గురువారం మణుగూరులో చోటుచేసుకుంది.

X
దిశ, మణుగూరు: షార్ట్ సర్క్యూట్‌తో కార్ల షెడ్డు దగ్ధమైన సంఘటన గురువారం మణుగూరులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మణుగూరు మండలంలోని గుట్ట మల్లారం టీవీఎస్ బైక్ షోరూం పక్కన గల కార్ మెకానిక్ షెడ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షెడ్‌లో ఉన్న ఒక కారు పూర్తిగా ధ్వంసం కాగా కొన్ని కార్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే స్థానికులు ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించగా అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మొరాయించింది. ఇంజిన్ పని చేయక నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది తలెత్తింది. అక్కడున్నవారు నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి సంబంధించి షాపులోని స్పేర్ పార్ట్లు 4 లక్షల రూపాయల విలువ ఉంటుందని షెడ్డు నిర్వాహకులు తెలిపారు.
Next Story






