వ్యూవ్స్ కోసం కోసం డ్రైనేజ్‌లో స్నానం చేసి బ్రెడ్ ముంచుకుని తిన్న యూట్యూబర్

by Ajay Maddhiboyina |

ఢిల్లీకి చెందిన సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లుయెన్స‌ర్ పునీత్ సూప‌ర్ స్టార్ మాత్రం డ్రైనేజీలో స్నానం చేశాడు. అక్క‌డితో ఆగ‌కుండా డ్రైనేజీ నీటిలో బ్రెడ్ ముంచుకుని తిన్నాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

వ్యూవ్స్ కోసం కోసం డ్రైనేజ్‌లో స్నానం చేసి బ్రెడ్ ముంచుకుని తిన్న యూట్యూబర్
X

దిశ, వెబ్ డెస్క్: దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. కానీ కొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్సర్‌లు మాత్రం తమకు ఎలాంటి లిమిట్స్ లేవు అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఓ యూట్యూబర్ వ్యూవ్స్, లైక్స్ కోసం చేసిన పనిచూసిన నెటిజన్లు అతడిని ఛీ కొడుతున్నారు. డబ్బుల కోసం మరీ ఇంత దిగజారాలా అని మండిపడుతున్నారు. అసలు వీడు మనిషేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ యూట్యూబ‌ర్ చేసిన గ‌బ్బు ప‌ని విష‌యానికి వ‌స్తే.. ఎవ‌రైనా స్నానం మంచి నీటిలో చేస్తారు. కానీ ఢిల్లీకి చెందిన సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లుయెన్స‌ర్ పునీత్ సూప‌ర్ స్టార్ మాత్రం డ్రైనేజీలో స్నానం చేశాడు.

అక్క‌డితో ఆగ‌కుండా డ్రైనేజీ నీటిలో బ్రెడ్ ముంచుకుని తిన్నాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. మురికి కాలువ‌లో నిండా మునిగి తిరిగి లేచి అక్క‌డే కూర్చుని, అత‌డు బ్రెడ్ ను నీటిలో ముంచి తింటూ చూడండి అంటూ కెమెరాకు సైతం చూపించాడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. లైక్స్ వ్యూవ్స్ కోసం ఇలాంటి వికృత చేష్టాల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని, డ‌బ్బులు కావాలంటే అడుక్కు తినాలి కానీ ఇలా ట్రైనేజీలోనే ముంచుకుని తిన‌వ‌ద్ద‌ని అంటున్నారు. అయితే గ‌తంలోనూ పునీత్ సూప‌ర్ స్టార్ ఇలాంటి వీడియోలే చేసి వార్త‌ల్లో నిలిచాడు.

Next Story