- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూడంకుళం రియాక్టర్ డేటా సేఫ్: NPCIL
కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం డేటా లీక్ వార్తలను ఎన్‌పీసీఐఎల్ ఖండించింది. అణు భద్రత సమాచారమంతా సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం డేటా లీక్ వ్యవహారంపై న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) స్పందించింది. డార్క్ వెబ్‌లో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వేలాది ఫైళ్లను లీక్ చేసినట్లు ఒక రాన్సమ్‌వేర్ గ్రూప్ ప్రకటించిన నేపథ్యంలో కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్‌లో సున్నితమైన డేటా ఉల్లంఘన జరిగిందన్న వార్తలను NPCIL ఖండించింది. అణు భద్రత వ్యవస్థల వివరాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని ఎన్‍పీసీఐఎల్ స్పష్టం చేసింది. కుడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టు 3,4 యూనిట్ల డేటా సేఫ్ గా ఉందని వీటి డేటా లీక్ కాలేదని తెలిపింది.
ఆ సమాచారం అంతా సీక్రెట్ గానే:
కేవలం బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్‍కు చెందిన ఫైళ్లు మాత్రమే లీకయ్యాయని NPCIL స్పష్టం చేసింది. అణు భద్రతకు సంబంధించిన సమాచారమంతా రహస్యంగా ఉందని తెలిపింది. ఈ యూనిట్లలో నిర్మాణ సంబంధింత సేవల కోసం 2018లో పబ్లిక్ టెండర్ ప్రక్రియ ద్వారా రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి ఇంజినీరింగ్, ప్రొక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అప్పగించామని తెలిపింది. దీనికి అణు భద్రతా వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేదని అణు భద్రతకు సంబంధించిన సమాచారమంతా రహస్యంగానే ఉన్నట్లు తెలిపింది.
అసలు ఏం జరిగింది?
కూడంకుళం ప్రాజెక్టును భారత్‌కు చెందిన ఎన్‌పీసీఐఎల్, రష్యాకు చెందిన రోసాటమ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 6,000 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంగా ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో ఇప్పటికే 1, 2 యూనిట్లు విజయవంతంగా నడుస్తుండగా, మిగిలిన 3, 4, 5, 6 యూనిట్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ప్లాంట్‌లోని బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్‌కు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్‌గా ఉంది. అయితే 'వరల్డ్ లీక్స్' అనే రాన్సమ్‌వేర్ కూడంకుళం ప్లాంట్‌కు చెందిన దాదాపు 19 వేలకుపైగా ఫైళ్లను డార్క్ వెబ్‌లో లీక్ చేసిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ లీక్ అయిన ఫైళ్లలో ఇంజనీరింగ్ బ్లూప్రింట్లు, వెండర్ల జాబితాలు, తనిఖీ రికార్డులు, నిర్వహణ పత్రాలు ఉన్నాయని, ఇవన్నీ ప్లాంట్ కాంట్రాక్టర్ అయిన 'రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్' సర్వర్ నుండి చోరీకి గురయ్యాయని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన NPCIL అణు భద్రతకు సంబంధించిన సమాచారం అంతా సేఫ్‌గా ఉన్నట్లు ప్రకటించింది.






